త్రివిక్రమ్-మహేష్ సినిమాలో బుట్టబొమ్మ ఉందా?

by GSrikanth |
త్రివిక్రమ్-మహేష్ సినిమాలో బుట్టబొమ్మ ఉందా?
X

దిశ, సినిమా : ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరుపుకోగా.. జూలై ఫస్ట్ వీక్ నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే పక్కా యాక్షన్ కమర్షియల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నారు. ఇక ఇటీవల పూజా.. తన రెమ్యునరేషన్ డేట్స్ విషయంలో అడ్జెస్ట్ కాలేదని.. దీంతో ఈ మూవీ నుంచి తప్పుకుందని వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పందించిన చిత్రబృందం అవన్నీ అవాస్తవాలని.. పూజనే హీరోయిన్‌గా నటిస్తుందని తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో పూజతో పాటు.. 'పెళ్లి సందడి' హీరోయిన్ శ్రీలీల సెకెండ్ హీరోయిన్‌గా నటిస్తుందని చెప్పింది. కాగా మహేష్ శ్రీలీలకు ఒక డ్యూయెట్ కూడా ఉందని టాక్ వినిపిస్తుంది. ఇకపోతే ఈ మూవీకి సంగీత దర్శకుడు తమన్ అదిరిపోయే ట్యూన్స్ అందించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed