Iodine Deficiency: ప్రెగ్రెన్సీ మహిళల్లో అయోడిన్ లోపిస్తే జన్మించే పిల్లలకు ప్రాబ్లమా..?

by Anjali |
Iodine Deficiency: ప్రెగ్రెన్సీ మహిళల్లో అయోడిన్ లోపిస్తే జన్మించే పిల్లలకు ప్రాబ్లమా..?
X

దిశ, వెబ్‌డెస్క్: అయోడిన్ (Iodine)ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మానవ శరీరంలో అయోడిన్ లోపిస్తే భయంకరమైన లక్షణాలు కనిపిస్తాయి. కాగా కనీస మోతాదులో అయోడిన్ కలిగిన సాల్ట్ తీసుకోవాలి. అయోడిన్ లోపిస్తే గుండె వేగం తగ్గుతుంది. గొంతునొప్పి వస్తుంది. హెయిర్ ఫాల్(Hair fall) అవ్వడం, వాపు, అధిక నిద్ర, విపరీతమైన నిద్ర(Excessive sleep) వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మహిళల్లో అయోడిన్ లోపిస్తే మానసిక, శారీరక అభివృద్ధిపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు నిపుణులు. గర్భిణీల్లో అయోడిన్ లోపిస్తే గర్భస్రావం, వికలాంగు శిశువు(disabled child), పిల్లల్లో మరుగుజ్జు, నవజాత శిశువులు, అంధత్వం, చెవుడు, లైంగిక అభివృద్ధి లేకపోవడం, నత్తిగా మాట్లాడటం, మానసిక సమస్యలు, గొంతుబొంగురు పోవడం, కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతాయి.

అంతేకాకుండా చరుకుదనం కోల్పోతారు. తరచూ నీరసంగా ఉంటారు. శరీరంపై కురుపులు అవుతాయి. ఊబకాయం, లైంగిక ఉదాసీనత వంటి ప్రాబ్లమ్స్ వంటివి వస్తాయి. కాగా ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రతిరోజూ లిమిట్స్ లో అయోడిన్ ఉప్పు(Iodine salt) తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. కానీ అయోడిన్ తక్కువ పరిణామంలో తీసుకోవాలి. ప్రతిరోజూ కేవలం 150 మైక్రోగ్రాములు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పిల్లలకైతే 50 మైక్రోగ్రాములు, ప్రెగ్రెన్సీ మహిళలు 200 మైక్రోగ్రాములు తీసుకుంటే చాలు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed