AP Cabinet: ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘటనలు.. కొత్త సంప్రదాయానికి తెరలేపిన జగన్!

by Satheesh |   ( Updated:2022-04-11 13:17:05.0  )
AP Cabinet: ప్రమాణ స్వీకారంలో ఆసక్తికర ఘటనలు.. కొత్త సంప్రదాయానికి తెరలేపిన జగన్!
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ కొత్త సంప్రదాయానికి తెరలెపుతూ మంత్రివర్గాన్ని రెండోసారి విస్తరించారు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలు బహిరంగంగానే అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ హోంమంత్రి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కొత్తగా ఎన్నికైన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులు ఒక్కొరు ఒక్కో విధంగా సీఎం జగన్ వద్ద విధేయత చాటుకున్నారు.

ఈ కార్యక్రమంలో కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి.. సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్‌కు నమస్కరించి వెళ్లిపోగా.. మరికొందరు మాత్రం జగన్‌ కాళ్లు మొక్కారు. మంత్రి నారాయణస్వామి సీఎం జగన్‌ కాళ్లు తాకి నమస్కరించగా.. కొత్తగా ఎన్నికైన మంత్రి ఉష శ్రీచరణ్‌ ముఖ్యమంత్రి కాళ్లకు మొక్కారు. మరో ఇద్దరు మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, జోగి రమేశ్‌ ఇంకాస్త విధేయతతో మోకాళ్లపై పడి మరీ దండాలు పెట్టారు. మంత్రి రోజా ప్రమాణస్వీకారం తర్వాత సీఎం వద్దకు వెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించి, చేతిని ముద్దాడారు. ఇప్పటీ వరకు తమిళనాడు వరకే ఉన్న ఈ కల్చర్‌ను జగన్ ఆంధ్రాకు తీసుకువచ్చారంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed