ఆ గురుకుల పాఠశాలలో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి

by Vinod kumar |
ఆ గురుకుల పాఠశాలలో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. విద్యార్థినీ నీటి ట్యాంకులో పడి ఆత్మహత్యకు పాల్పడిందా..? లేక ఒత్తిళ్లు, బెదిరింపులకు భయపడి ఆత్మహత్య చేసుకుందా..? లేక ఎవరైనా హత్య చేసి ఆమెను అందులో పడవేశారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గురుకుల విద్యాసంస్థలో నిజాంసాగర్ మండలం ముగ్ధుంపూర్ గ్రామానికి చెందిన శిరీష ఇంటర్(మొదటి సంవత్సరం) చదువుకుంటోంది. గురుకులం ఆవరణలోని నీటి ట్యాంకులో తన మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఆర్సీవో మేరీ ఏసుపాదం, డీసీవో రామ్ కుమార్, డీఎస్పీ జైపాల్ రెడ్డి, సర్కిల్ ఇన్ స్పెక్టర్ కృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థినీ తల్లిదండ్రులు రాకముందే ఓవర్ హెడ్ ట్యాంకు నుంచి మృతదేహం తీయడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరీష వాటర్ ట్యాంక్ లో పడి మృతి చెందిన విషయం ఆలస్యంగా గుర్తించారని ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థినీ మృతిపై పై గురుకులంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story