- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇంటర్‌పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు ఫస్టియర్, ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, మరికొద్ది రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశ వ్యాప్తంగా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్) - 2022 పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీల్లో మార్పు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఏన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు వివిధ రాష్ట్రాల్లోని బోర్డు ఎగ్జామ్స్‌తో క్లాష్ కాకుండా ఉండేలా తాజా షెడ్యూల్ రూపొందించారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే తాజా వాటిని సవరిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. సవరించిన తేదీల ప్రకారం.. ఏప్రిల్ 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష సెంటర్‌లకు సంబంధించిన నగరాల జాబితా సమాచారం ఏప్రిల్ మొదటి వారంలో తెలియజేయబడుతుందని ఎన్టీఏ తెలియజేసింది. 2022 ఏప్రిల్ రెండో వారం నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియను ప్రారంభించనున్నట్టుగా తెలిపింది. మరోవైపు జేఈఈ మెయిన్– 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకునేందకు వీలు కల్పించారు. ఫీజులను jeemain.nta.nic.inలో ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా పడటంతో తాజా షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడనున్నట్లు అధికారులు చెప్పుతున్నారు. దీనిపై త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది.