- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
1930's ప్రెగ్నెన్సీ టెస్ట్.. కప్పకు యూరిన్ ఇంజెక్ట్ చేస్తే రిజల్ట్
దిశ, ఫీచర్స్ : వైద్యరంగంలో పుట్టుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో మనిషి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని చిటికెలో కనిపెట్టేస్తున్నారు. కానీ ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని పూర్వపు రోజుల్లోనూ పలు పద్ధతుల ద్వారా రోగ నిర్ధారణ చేసేవారు. ప్రత్యేకించి మహిళల్లో ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మేషన్‌కు ఉపయోగించిన టెక్నిక్ తెలిస్తే అవాక్కవుతారు కూడా.
1930లో శాస్త్రవేత్తలు గర్భిణుల్లో ఎక్కువగా కనిపించే హార్మోన్‌ను గుర్తించేందుకు జంతువులు లేదా ప్రత్యక్ష కణజాలాలు ఉపయోగించి ప్రత్యేక పరీక్షలను అభివృద్ధి చేశారు. జర్మన్ రసాయన శాస్త్రవేత్త సెల్మార్ అస్కీమ్, గైనకాలజిస్ట్ బెర్న్‌హార్డ్ జోండెక్ డెవలప్ చేసిన ఈ పరీక్షను 'A-Z'గా పిలిచేవారు. ప్రెగ్నెంట్ ఉమెన్‌లో ప్రముఖంగా కనిపించే 'హ్యూమన్ కోరియోనిక్ గోనాడోట్రోపిన్ లేదా హెచ్‌సీజీ'గా పిలువబడే హార్మోన్‌ను గుర్తించడానికి ఈ టెస్ట్ నిర్వహించేవారు. ఇందులో భాగంగా ఫిమేల్ సౌతాఫ్రికన్ పంజా కప్పకు మహిళ మూత్రాన్ని ఇంజెక్ట్ చేసేవారు. ఆ తర్వాత 8 నుంచి 12 గంటల్లో ఆ కప్ప గుడ్లు పెడితే సదరు మహిళ గర్భవతిగా పరిగణించబడుతుంది.
ఇంజక్షన్‌కు ప్రతిస్పందనగా స్పెర్మ్‌ను ఉత్పత్తి చేసే మగ ఆఫ్రికన్ పంజా కప్పలపై కూడా ఈ పరీక్ష పనిచేసింది. A-Z టెస్ట్ డెవలపర్స్ చాలా రోజుల పాటు స్త్రీ మూత్రాన్ని ఐదు ఎలుకలకు ఇంజెక్ట్ చేసిన తర్వాత ఆ ఎలుకలను చంపి, వాటి శరీరంలోని అండాశయాలను పరిశీలిస్తారు. అప్పుడు విస్తరించిన లేదా రద్దీగా ఉండే నమూనాలు గర్భాన్ని సూచిస్తాయి. అయితే కొన్నేళ్ల తర్వాత కుందేళ్లపై ప్రయోగించే మెరుగైన పరీక్ష అభివృద్ధి చేయబడింది. ఇది దాదాపు 98% ఖచ్చితమైనది. నేటికీ అనేక ఆధునిక గర్భధారణ పరీక్షలు.. మహిళల మూత్రంలో hCG ఉనికిని గుర్తించడం ద్వారా ప్రెగ్నెన్సీని నిర్ధారిస్తున్న సంగతి తెలిసిందే.