తెలంగాణలో అధికారం ఆ పార్టీదే.. 'ఆరా' సర్వేలో సంచలన విషయాలు

by GSrikanth |   ( Updated:2022-07-13 12:42:34.0  )
తెలంగాణలో అధికారం ఆ పార్టీదే.. ఆరా సర్వేలో సంచలన విషయాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ పార్టీ పుంజుకుంటున్నదని 'ఆరా పోల్​స్ట్రాటజీస్​ప్రైవేట్​లిమిటెడ్' సర్వేలో వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98% ఓట్లను సాధించిన బీజేపీ, 2019 పార్లమెంట్​ఎన్నికల్లో 29.78 శాతం ఓట్లను సాధించినట్లు పొందుపరిచారు. ఇక ప్రస్తుతం చేసిన సర్వే ప్రకారం 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే బీజేపీ 23.5 శాతం అధిక ఓట్లను సాధించి 2023లో 30.48 శాతం ఓట్లను పొందనున్నట్లు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్​జిల్లాలను ఒక జోన్‌గా విభజించి సర్వే చేయగా బీజేపీ 35.69 శాతం ఓట్లు రానున్నట్లు వివరించారు. ఇక మెదక్, మహబూబ్​నగర్‌లో 30.37 శాతం, హైదరాబాద్, రంగారెడ్డిలో 35.32 శాతం చొప్పున ఓట్లు రానున్నట్లు పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండలో 20.54 శాతం ఓట్లు వస్తున్నట్లు వెల్లడించారు.

5 జిల్లాల్లో పోటీ...

ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని తెలిపారు. మెదక్, మహబూబ్​నగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండనున్నట్లు ఆరా పేర్కొన్నది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 16 నియోజక వర్గాల్లో బీజేపీ వర్సెస్​టీఆర్ఎస్ ఫైట్​నడవనున్నది. మరో 8 నియోజకవర్గాల్లో బీజేపీ మూడో స్థానంలో ఉండనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 29 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే ఈ పార్టీకి ఇతర పార్టీల నుంచి చేరే బలమైన అభ్యర్థులు మాత్రమే అధికార తీరాలకు చేర్చగలరని క్లారిటీ ఇచ్చారు.

తగ్గిన కాంగ్రెస్‌ గ్రాఫ్...

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్​రోజురోజుకూ పడిపోతున్నట్లు 'ఆరా' వెల్లడించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్​, 2019 పార్లమెంట్​ఎన్నికల్లో 29.78 శాతం ఓట్లను సాధించింది. ప్రస్తుత సర్వేలో గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 4.72 శాతం ఓట్లను కోల్పోయి 23.71 శాతానికి పరిమితం కానున్నది. అయితే, టీపీసీసీ ప్రెసిడెంట్ ఇటీవల ప్రకటించినట్లు 90 లక్షల ఓట్లు వస్తాయా? లేదా? అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఆయన ఓట్​షేర్ చెప్పి ఉంటే అంచనా వేసి ఉండేవాళ్లమని ఆరా ఎండీ మస్తాన్​తెలిపారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​మూడో స్థానంలో ఉంటుందని అంచనా వేసిన సర్వే, వరంగల్, ఖమ్మం, నల్లగొండలో టీఆర్ఎస్‌తో పోటీ పడుతుందన్నారు. మెదక్, మహబూబ్​నగర్​జిల్లాల్లో త్రిముఖ పోటీ ఉంటుందన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 16 స్థానాల్లో కాంగ్రెస్​మూడో స్థానంలో ఉండగా, 8 నియోజకవర్గాల్లో నాలుగో స్థానంలో ఉన్నది.

టీఆర్ఎస్ డౌన్

రాష్ట్రంలో టీఆర్ఎస్​ పార్టీ గ్రాఫ్ డౌన్ అవుతున్నది. 2018 ఎన్నికల్లో 46.87 శాతం ఓట్లు సాధించిన టీఆర్ఎస్, నాలుగు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 5 శాతం ఓట్లను కోల్పోయి 41.71 శాతమే సాధించింది. ప్రస్తుత సర్వే ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల కంటే 8 శాతం ఓట్లను కోల్పోయి 38.88 శాతం ఓట్లను పొందనున్నది. అధికార పార్టీ పరిపాలన తీరు బాగుందని ఓటర్లు విశ్వసిస్తున్నప్పటికీ, కేసీఆర్​కుటుంబ ఆధిపత్యం రాష్ట్రంలో పెచ్చుమీరందనే భావన ప్రజల్లో బలంగా పెరిగింది. దీంతోనే రోజురోజుకీ టీఆర్ఎస్​పార్టీ ఓటు బ్యాంక్​ తగ్గిపోతున్నట్లు ఆరా మస్తాన్​వెల్లడించారు. మరోవైపు ఈసారి బీఎస్పీ ప్రభావం ఉంటుందన్నారు. సుమారు 5 శాతం ఓట్లను తెచ్చుకోగలదని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే.. మళ్లీ టీఆర్ఎస్ పార్టీనే అధికారం చేజిక్కించుకుంటుందని అంచనా వేశారు.

Advertisement

Next Story

Most Viewed