- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఎమోజీలపై.. భారతీయుల్లో గందరగోళం!
దిశ, ఫీచర్స్ : మనలోని ఎమోషన్స్, మనం చేసే సంజ్ఞలకు ప్రతిరూపంగా తెరమీదకు వచ్చినవే 'ఎమోజీ'లు. ఈమేరకు ఒక్కో ఎమోజీకి ఒక్కో మీనింగ్ ఉంటుంది. అయితే కొన్ని ఎమోజీల విషయంలో చాలా మంది భారతీయ వినియోగదారులు వాటి కచ్చితమైన వినియోగం గురించి గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తోందని తాజా సర్వే వెల్లడించింది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికా, ఆసియా, యూరప్‌లోని 9,400 మంది డుయోలింగ్ (DuoLingo) సర్వేలో పాల్గొన్నారు.
ఆనందం, నవ్వు, దుఃఖాన్ని సూచించే ఎమోజీలు చాలా మందికి సాధారణ అర్థాన్ని కలిగి ఉన్నాయని సర్వే కనుగొంది. అయితే డబ్బు, పండ్లు, కూరగాయలు మాత్రం విభిన్నమైన పర్‌సెప్షన్ కలిగి ఉన్నట్లు తేలింది. కానీ (😭, 😘 , 🍑) ఈ మూడు ఎమోజీల విషయంలో 36 శాతం ఇండియన్ యూజర్స్ ఎక్కువగా గందరగోళానికి గురవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.
👀 - 'కళ్ళ' ఎమోజీ విషయానికి వస్తే, దాదాపు 46 శాతం 'నేను నిన్ను చూస్తున్నాను' అని పేర్కొనగా, దాదాపు 27 శాతం మంది 'నేను దీన్ని చూస్తున్నాను' అని.. మరో 10 శాతం 'నాకు తెలుసు' అని.. ఇంకో పది శాతం మంది 'ఓహ్'(whoa) అని చెప్పేందుకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
😂 - లాఫింగ్ విత్ టియర్ ఎమోజీని 45 శాతం మంది 'నేను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాను' అని అర్థంలో ఉపయోగిస్తుండగా, 32 శాతం మంది 'అది హిలేరియస్‌గా ఉంది' అని అభిప్రాయపడ్డారు. 12 శాతం మంది 'ఎంబార్సింగ్లీ ఫన్నీ' అని తెలిపారు. మొత్తానికి 'బిగ్గరగా ఏడుపు' (😭), 'సంతోషంతో కూడిన కన్నీళ్లతో కూడిన ముఖం (😂) ఎమోజీల మధ్య గందరగోళంలో ఉన్నట్లు సర్వే తేల్చింది. 'లౌడ్లీ క్రయింగ్' ఎమోజీని 56 శాతం మంది భారతీయులు 'ఏడుపు లేదా కలత చెందిన ఏడుపు'గా భావిస్తే, 22 శాతం మంది 'నేను ఆనందంతో ఏడుస్తున్నాను' అని అభిప్రాయపడుతున్నారు.
😘 - ఈ ఎమోజీని 52 శాతం మంది 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' అనే అర్థం ఉపయోగిస్తుండగా, 27 శాతం మంది మాత్రం 'ప్లాటోనిక్ లవ్' చిహ్నంగా భావిస్తున్నారు.
💸 - మనీ ఎమోజీని తరచుగా చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ఈ మేరకు 41 శాతం మంది 'డబ్బు ప్రవాహాన్ని' సూచించేందుకు ఉపయోగిస్తే, 40 శాతం మంది 'డబ్బు కోసం ఆశతో' అనే అర్థంలో వినియోగిస్తున్నారు. ఆసక్తికరంగా, 14 శాతం మంది దీన్ని 'డబ్బు నష్టం'కు సూచనగా వాడారు. సాధారణంగా ఈ ఎమోజీకి అర్థం 'డబ్బు పోగొట్టుకోవడం'.