- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana News : రాష్ట్రంలో కాకమీదున్న రాజకీయం.. అస్త్రాలు సర్దుకుంటున్న పార్టీలు!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కాకమీదుంది. పొలిటికల్ టెంపరేచర్ డబుల్ హీటెక్కింది. జాతీయ స్థాయి నేతలు రాష్ట్రం వైపు పరుగులు తీసేందుకు రెడీ అవుతున్నారు. రాష్ట్ర నేతలు గ్రామాల బాట పట్టారు. కేంద్రాన్ని టార్గెట్చేస్తూ అధికార పార్టీ రోడ్డెక్కింది. నాయకుల పర్యటనలు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, పరస్పర విమర్శలతో పల్లె నుంచి పట్టణం వరకూ దద్దరిల్లుతున్నది. ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ స్పీడ్ పెరిగింది. బీజేపీని టార్గెట్చేస్తున్న కేసీఆర్‌కు, కనీసం పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు కొంత ఇబ్బంది తెచ్చి పెట్టాయి. ఇదే సమయంలో రాజకీయ వేడిపై గవర్నర్మరింత ఆజ్యం పోశారు. ప్రొటోకాల్పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
మినీ పోరుతో బీజేపీ స్పీడ్
ఐదు రాష్ట్రాల ఎన్నికలను మినీ సమరంగా తీసుకున్న కమలం పార్టీ క్లియర్కట్మెజార్టీ సాధించింది. ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం హీట్ ఎక్కింది. ఫ్రంట్ లేదు.. టెంటూ లేదూ అంటూ కమలనాథులు.. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న కేసీఆర్.. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి ప్రయత్నాలకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు బ్రేక్‌వేశాయి. ఒక దశలో ఈ మినీ సమరంలో బీజేపీకి ఎదురుగాలి తప్పదంటూ వ్యాఖ్యలు చేశారు. సీన్ రివర్స్ అయింది. సరిగ్గా ఈ పరిస్థితులే రాష్ట్ర బీజేపీ నేతలకు ఆయుధంగా మారాయి. కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు పెంచుతున్నారు.
దూకుడు పెంచిన కాంగ్రెస్
మరో వైపు కాంగ్రెస్దూకుడు పెంచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే టార్గెట్‌గా వరుస పోరుకు దిగుతున్నది. ఇటీవల ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ.. రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బహిరంగ విమర్శలకు దిగిన నేతలను సమన్వయం చేసేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. అటు తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రానికి వ్యూహకర్తగా సునీల్కనుగోలుతో ఒప్పందం చేసుకున్నారు. సునీల్ బృందం ఇచ్చిన నివేదికతో రాహుల్‌గాంధీ రాష్ట్రంపై కన్నేశారు. కష్టపడితే.. రాష్ట్రంలో మళ్లీ పాగా వేసే అవకాశం ఉన్నదంటూ నేతలకు సూచనలు చేస్తున్నారు.
ఆప్ కీ కదమ్ ఔర్ ఆగే!
పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆప్.. తెలంగాణపైనా దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు నేతలతో సంప్రదింపులు చేస్తున్నది. తమతో కలిసి రావాలంటూ ఆప్అధినేత కేజ్రీవాల్పలువురికి సంకేతాలిస్తున్నారు. టీజేఎస్‌అధ్యక్షుడు కోదండరాంతో కూడా సంప్రదింపు జరుపుతున్నారు. ఉన్నత ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్‌కుమార్, మాజీ ఐఏఎస్ఆకునూరి మురళి వంటి వారితోనూ ఆప్నేతలు టచ్‌లో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
జాతీయ నేతల రాచబాట
రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిన నేపథ్యంలో జాతీయ స్థాయి నేతల రాక పోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బీజేపీ నేతలు రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు. త్వరలోనే అమిత్‌షా రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి అమిత్‌షా ఈ నెల 14న రావాల్సి ఉండగా పర్యటన వాయిదా పడింది. పార్టీ జాతీయ నేతలు రాష్ట్రానికి ప్రతి వారం వస్తూనే ఉన్నారు. ఇక ఆప్ అధినేత కేజ్రీవాల్ఈ నెల 14న రాష్ట్రానికి రానున్నారు. కాంగ్రెస్అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ నెలాఖరున రాష్ట్రానికి వచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. వరి ధాన్యం కొనుగోళ్లపై పోరు సాగిస్తున్న రాష్ట్ర నేతలకు మద్దతుగా ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
యాత్రలు..పాదయాత్రలు
రాష్ట్రంలో రాజకీయ యాత్రలు జోరందుకున్నాయి. బండి సంజయ్ప్రజా సంగ్రామ యాత్ర మలి విడత మొదలవుతుండగా.. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు. అటు షర్మిల యాత్ర కూడా కొనసాగుతున్నది. బహుజన రాజ్యాధికారం పేరుతో అటు బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ యాత్ర చేస్తున్నారు. నియోజక వర్గాల్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా పాదయాత్రలకు శ్రీకారం చుడుతున్నాయి. రాష్ట్ర మంతా పాదయాత్ర చేయాలని అటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఢిల్లీలో కేసీఆర్.. రోడ్లపై మినిస్టర్లు
ధాన్యం అంశంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ వేదికగా పోరు సాగిస్తున్నారు. రాష్ట్రంలోనూ మంత్రులతో సహా ఆ పార్టీ నేతలు నిరసనలు చేస్తున్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. పెట్రోల్,డీజిల్‌ధరల పెంపునకు నిరసనగా ఇటీవల టీఆర్ఎస్నేతలు ఆందోళనకు దిగారు.
ఆజ్యం పోస్తున్న గవర్నర్ అంశం
రాజకీయాలు హీట్పెంచుతున్న నేపథ్యంలో గవర్నర్అంశం మరింత ఆజ్యం పోస్తున్నది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నర్‌ను ఖాతరు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవలే వరంగల్, యాదాద్రి పర్యటనకు వెళ్లిన ఆమె తనకు ప్రొటోకాల్ దక్కలేదని పీఎం, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసీఆర్ సర్కారుకు, గవర్నర్‌కు మధ్య గ్యాప్పెరిగినట్లు స్పష్టమైంది. ఇదే సమయంలో గవర్నర్అవకాశం వచ్చినప్పుడల్లా గ్రామాలకు వెళ్తున్నారు. సీతారాముల కల్యాణానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. రాజ్ భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వంతో ఇబ్బందులు పడే వారంతా రాజ్‌భవన్‌కు రావాలంటూ సంకేతాలిస్తున్నారు.