ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర.. భారత్‌ను ప్రశంసించిన ప్రధాని

by Harish |
ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర.. భారత్‌ను ప్రశంసించిన ప్రధాని
X

ఇస్లామాబాద్: పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు కొందరు ప్రణాళికలు రచించినట్లు భద్రతా ఏజేన్సీలు పేర్కొన్నాయి. ఈ నివేదిక తర్వాత ప్రధాని భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన తెలిపారు. మరోవైపు, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్‌‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియన్ పాస్ పోర్ట్ కు ప్రపంచ దేశాల్లో చాలా విలువ ఉందని అన్నారు. అంతేకాకుండా భారత్ తో పోల్చుకునే పరిస్థితిలో పాక్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకుముందు కూడా భారత విదేశాంగ విధానం బాగుందని ప్రశంసించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed