50 మంది విద్యార్థులకు అస్వస్థత.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం!

by GSrikanth |
50 మంది విద్యార్థులకు అస్వస్థత.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం!
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 50 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. కలుషితమైన తాగునీరు కారణంగానే అస్వస్థతకు గురైనట్లు విద్యార్థులు తెలిపారు. తాగునీటి విషయమై ఇప్పటికే యాజమాన్యానికి అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. వాటర్ పైపులైన్ పగలడంతో నీరు కలుషితం అవుతోందని అన్నారు. దీనిపై సంబంధిత సివిల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లామని, అయినా పట్టించుకోవడం లేదని అన్నారు. దీంతో చేసేదేంలేక మిగిలిన విద్యార్థులు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్కే ఫైవ్ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల యాజమాన్యం సంపూర్ణ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. 50 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురికాగా, వారిలో సుమారు ఏడుగురు విద్యార్థులను అధికారులు అర్ధరాత్రి తీసుకురావడం పట్ల పలు అనుమానాలు ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు ఆసుపత్రికి రాకపోగా, తెల్లవారుజామున హడావిడిగా అస్వస్థతకు గురైన విద్యార్థులను డిశ్చార్జ్ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed