- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జలుబు రాగానే అమ్మో అనుకుంటున్నారా.. శరీరానికి బోలెడు లాభాలున్నాయి?

దిశ, వెబ్‌డెస్క్: జలుబు(cold) ఒక సాధారణ సమస్య. తరచూ తుమ్ముతూ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. తుమ్ముతుంటే పక్కన ఉన్నవారికి కూడా ఇబ్బందే. ముక్కులో చిరాకు, ఎర్రబడటం, ముక్కు కారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ జలుబు రాగానే అమ్మో అనుకోకండి. బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కోల్డ్ శరీరాన్ని హెల్తీగా ఉంచే ప్రక్రియలకు కారణమవుతుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచడమే కాకుండా.. శరీరం టాక్సిన్ల(toxins)ను తొలగించడం, హైడ్రేషన్ పెంచడం, శరీరానికి విశ్రాంతికి ఇవ్వడం వంటి సహజ ప్రక్రియలు జరుగుతాయి. కాగా ప్రయోజనాలు కూడా గుర్తించండని నిపుణులు సూచిస్తున్నారు.
కోల్డ్ వచ్చినప్పుడు శరీరంలోని వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో భాగంగా ఎన్నో జీవక్రియల్ని, రసాయనాలను ప్రేరేపిస్తుంది. ఇమ్యూనిటి సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉంటే ఇతర రోగాలకు చోటు ఇవ్వదు. దీర్ఘకాలిక ఇమ్మూనిటి(Chronic Immunity)ని పెంచుతుంది. కాగా ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయడానికి శరీరం సిద్ధపడుతుంది. వీటితో పాటుగా బాడీని డిటాక్స్(Detox the body) చేయడంలో సహాయకారిగా ఉంటుంది. నోటి నుంచి కఫం రూపంలో శరీరంలోని ఇన్ఫెక్షన్లను విసర్జిస్తుంది. తద్వారా టాక్సిన్లను, హానికరమైన పదార్థాలను బయటకు పంపిస్తుంది.
అలాగే రక్తప్రసరణ పెంచి ఒత్తిడి(stress) తగ్గించడంలో జలుబు మేలు చేస్తుంది. బాడీపరిపూర్ణంగా ఫిట్‌గా మారుతుంది. జలుబు వచ్చి వెళ్లినాక శరీరానికి మెరుగైన స్థితిని తీసుకువస్తుంది. కాగా చర్మం, ఇతర అవయవాలన్నీ హెల్తీగా ఉంచుతుంది. యాంటీ ఫంగల్ లక్షణాలు, యాంటీ బాక్టీరియల్ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు సహజంగా చర్యలు తీసుకుంటుంది.