మళ్లీ ఫస్ట్ ప్లేస్‌లోకి భారత ఆల్‌రౌండర్.. దిగజారిన రోహిత్ శర్మ ర్యాంక్

by Vinod kumar |
మళ్లీ ఫస్ట్ ప్లేస్‌లోకి భారత ఆల్‌రౌండర్.. దిగజారిన రోహిత్ శర్మ ర్యాంక్
X

దిశ, వెబ్‌డెస్క: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. శ్రీలంకతో ఇటీవల ముగిసిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తన పేలవ ప్రదర్శన తర్వాత రవీంద్ర జడేజా తాజా ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ జాబితాలో నం.1 స్థానాన్ని తిరిగి పొందాడు. వెస్టిండీస్‌కు చెందిన జాసన్ హోల్డర్ 2వ స్థానంలో నిలిచాడు.

జాసన్ హోల్డర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటున్నాడు.. ఇప్పటివరకు ముగిసిన రెండు మ్యాచ్‌లలో అతను సాధారణంగానే ఆడాడు. దీంతో రవీంద్ర జడేజా 385 రేటింగ్ పాయింట్లతో నం.1, జాసన్ హోల్డర్ 357 రేటింగ్ పాయింట్లతో 2వ స్థానంలో నిలిచాడు. 341 రేటింగ్ పాయింట్లతో భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ నెం.3 స్థానంలో ఉన్నాడు.

టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విభాగంలో.. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లాబుస్‌చాగ్నే అద్భుతమైన ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్ చార్ట్‌లో నం.1 స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 196 పరుగులతో అద్భుత ప్రదర్శన చేయడంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానానికి చేరుకున్నాడు.

భారత ప్లేయర్స్ విషయానికి వస్తే.. ఆరో స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ఒక స్థానం దిగ‌జారాడు. 754 రేటింగ్ పాయింట్లతో హిట్‌మ్యాన్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక 742 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ, 738 రేటింగ్ పాయింట్లతో రిష‌బ్ పంత్ తొమ్మిది, ప‌దో స్థానాల్లో స్థిరంగా కొన‌సాగుతున్నారు.


Advertisement

Next Story

Most Viewed