- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Pooja Hegde: ఆ విషయంలో ఇక నుంచి జాగ్రత్తగా ఉంటా.. పూజా హెగ్డే ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ పూజా హెగ్డే(Pooja Hegde) ‘ముకుంద’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun), మహేష్ బాబు, ప్రభాస్, సల్మాన్ ఖాన్(Salman Khan), విజయ్ వంటి స్టార్ హీరోల సరసన చాన్స్ అందుకుని బుట్టబొమ్మగా ఫుల్ ఫేమ్ తెచ్చుకుని ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే ఈ అమ్మడు గత ఏడాది ‘కిసి బాయ్ కిసికా జాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో కొద్ది రోజుల నుంచి పూజా హెగ్డేకు ఆఫర్లు తగ్గిపోవడంతో యాడ్స్ చేసింది. ప్రజెంట్ దళపతి విజయ్(Thalapathy Vijay) హీరోగా వస్తున్న 69వ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు సమాచారం.
అలాగే సూర్య(Suriya ) 44వ సినిమాలో కూడా నటించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే(Pooja Hegde) ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘కథల ఎంపిక విషయంలో గతంలో మాదిరిగా తప్పులు జరగకుండా చూసుకుంటాను. వచ్చే ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యత ఇస్తాను. సినిమా ఎంపిక విషయంలో మైండ్‌సెట్ మార్చకున్నాను. ఇకపై మరింత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటాను. గత చిత్రాలన్నింటిని చూసి ఎక్కడ తప్పులు జరిగాయో తెలుగుసుకుంటాను. వచ్చే ఏడాది విజయాలు అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది.