చేనేత కార్మికులకు నూలుపై 5 శాతం సబ్సిడీ పెంపు పట్ల హర్షం

by S Gopi |
చేనేత కార్మికులకు నూలుపై 5 శాతం సబ్సిడీ పెంపు పట్ల హర్షం
X

దిశ, రామన్నపేట: చేనేత కార్మికులకు నూలుపై 5 శాతం సబ్సిడీ పెంపు, కార్మికులకు, దర్జీలకు ఈఎస్ఐ వర్తింపు కేంద్రప్రభుత్వ నిర్ణయం స్వాగతిస్తున్నామని అఖిల భారత పద్మశాలి యువజన సంఘం జాతీయ నాయకులు రాపోలు రాజశేఖర్ అన్నారు. ఈ మేరకు రామన్నపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యసభ మాజీ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ నిరంతర శ్రమ, పోరాటం, కార్మికుల పట్ల నిబద్ధత ఫలితం నేడు కేంద్రం తీసుకున్న నిర్ణయమని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా 2017 ఏప్రిల్ 6న రాజ్యసభలో లేవనెత్తిన అంశానికి సమాధానంగా రాజ్యసభ సెక్రటేరియట్ కార్యదర్శి సోమవారం లేఖ అందించారని కేంద్రప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసిందని రాజశేఖర్ తెలిపారు.

చేనేత జాతి ఆత్మ పరిరక్షణకు ఉపక్రమించే విధంగా గతంలో కార్మిక భరోసా యాత్ర నిర్వహించిన రాపోలు ఆనందభాస్కర్ పర్యటనలో కార్మికుల స్థితిగతులపై, కరోనా ప్రభావం మొదలు నేటివరకు కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం జరిపారని తెలిపారు. కార్మికుల సమస్యలను భారత ప్రధాని నరేంద్రమోడీ చేనేత జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు విన్నవించి పలు సూచనలు చేయగా వాటిని పరిగణలోకి తీసుకున్న కేంద్రప్రభుత్వం నూలుపై సబ్సిడీ పెంపు, కార్మికులకు ఈఎస్ఐ వర్తింపు నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికుల పక్షాన రాపోలు ఆనందభాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో జిల్లా పద్మశాలి సంఘం ప్రధానకార్యదర్శి రాపోలు వీరమోహన్ రమేష్, గంజి నరేష్, గంజి చంద్రయ్య, ఉపేందర్, పెండేం లక్ష్మీనారాయణ, భాస్కర్, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed