- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పెరగనున్న సబ్బులు, డిటర్జెంట్ ధరలు!
న్యూఢిల్లీ: ముడిసరుకు ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణ ఒత్తిడిని అధిగమించేందుకు దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందూస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) తన సబ్బులతో పాటు డిటర్జెంట్ ఉత్పత్తుల ధరలను 3-5 శాతం పెంచినట్టు కొజెన్సిస్ నివేదిక గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ముడి సరుకుల ధరలు రానున్న రోజుల్లో కూడా పెరిగే అవకాశం ఉన్న కారణంగా హెచ్‌యూఎల్ ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నట్టు పేర్కొంది. తాజా పెంపు కారణంగా కంపెనీకి చెందిన రిన్, సర్ఫ్ ఎక్సెల్, వీల్ లాంటి డిటర్జెంట్ తో పాటు లక్స్, రెక్సోనా, పియర్స్, డవ్, హమామ్, లిరిల్ సబ్బుల ధరలు పెరగనున్నాయి.
సాధారణంగా సబ్బులను తయారు చేసే కంపెనీలన్నీ వాటి ఉత్పత్తిలో దాదాపుగా పామాయిల్‌ను ఉపయోగిస్తాయి. ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల పలు రకాల నూనెల దిగుమతులపై ప్రభావం పడింది. దీంతో హెచ్‌యూఎల్ ధరలను పెంచక తప్పటంలేదని చెబుతోంది. పెరిగిన ధరల అనంతరం సర్ఫ్ ఎక్సెల్ కిలో ధర రూ. 130 నుంచి రూ. 134కు, లక్స్ 100 గ్రాముల నాలుగు సబ్బుల ధర 6 శాతానికి పైగా పెరిగి రూ. 160 కి చేరుకుంది. ఇటీవలే హెచ్‌యూఎల్ కంపెనీ తన కాఫీ, టీ ఉత్పత్తుల ధరలను పెంచింది. హెచ్‌యూఎల్ బాటలోనే ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ బ్రిటానియా కూడా ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా 7 శాతం వరకు ధరలను పెంచాలని భావిస్తోంది. ఉత్పత్తుల తయారీలో కీలకమైన ముడి సరుకులన్నీ ధరలు పెరిగాయి. ఈ కారణంగానే ఉత్పత్తుల ధరలను పెంచాలని భావిస్తున్నట్టు కంపెనీ ఎండీ వరుణ్ అన్నారు.