Yoga: వెన్ను నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే ''కంధారాసనం'' ఎలా చేయాలి?

by Mahesh |   ( Updated:2022-05-04 07:49:29.0  )
Yoga: వెన్ను నొప్పుల నుంచి ఉపశమనం కలిగించే కంధారాసనం ఎలా చేయాలి?
X

దిశ, ఫీచర్స్: మొదటిగా నేల మీద వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లను మోకాలి వద్ద మడిచి పాదాలు తొడల దగ్గరకు వచ్చేట్టుగా చూసుకోవాలి. తర్వాత కుడి కాలి మడమను కుడిచేతితో, ఎడమ కాలి మడమను ఎడమచేతితో పట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఊపిరి పీలుస్తూ వెన్నెముక, నడుము భాగాలను వీలైనంత పైకి ఎత్తే ప్రయత్నం చేయాలి.

తల, భుజాలు, పాదాలు నేలపై నుంచి కదలనివ్వకూడదు. ఈ స్థితిలో 15 నుంచి 20 సెకన్ల పాటు ఉంచాలి. తరువాత నెమ్మదిగా గాలి వదులుతూ మొదట వెన్నెముక, నడుము భాగాన్ని నేల పైకి తీసుకురావాలి. ఇప్పుడు మడమలను వదిలేసి పాదాలను యథాస్థితిలో కి తీసుకొచ్చాక శవాసనంలోకి రావాలి. ఇలా రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఉపయోగాలు..

* వెన్ను నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

* గర్భాశయం, రుతు సంబంధమైన వ్యాధులతో బాధపడే మహిళలకు మేలు జరుగుతుంది.

* ఆస్తమా, శ్వాసకోశ సంబంధ వ్యాధులను దూరం చేస్తుంది.

* థైరాయిడ్ గ్రంథి శక్తివంతమవుతుంది.

* కాళ్ళ కండరాలకు బలం చేకూరుతుంది.

Advertisement

Next Story

Most Viewed