- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధార్ కార్డ్ ద్వారా IT రిటర్న్‌ను ఇలా చెక్ చేసుకొండి!
దిశ, వెబ్‌డెస్క్: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ITR ఫైల్ చేయడానికి చివరి తేదీ, మార్చి ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. అలాగే ITR ఫైల్ కోసం పాన్ కార్డ్‌ని, ఆధార్ కార్డ్,బ్యాంక్‌ని లింక్ చేయడం, KYC పూర్తి చేయడం కూడా అవసరం. ఒకవేళ ITR ఫైల్ సబ్మిట్ సమయంలో చేసిన కొన్ని తప్పుల వలన అది చెల్లనిదిగా పరిగణిస్తారు. అందుకనే IT రిటర్న్‌ను పూర్తి చేశాకా ఆన్‌లైన్‌లో ధృవీకరించడం చాలా అవసరం.
ఆధార్ OTPని ఉపయోగించి IT రిటర్న్‌ను చెక్ చేసుకొనే విధానం...
-మొదటగా https://www.incometax.gov.in/iec/foportal వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
-ఇ-వెరిఫై రిటర్న్ ఆప్షన్ ఎంచుకుని, పాన్, అసెస్‌మెంట్ ఇయర్, రసీదు సంఖ్య, మొబైల్ నంబర్ వంటి అవసరమైన వివరాలు నమోదు చేయాలి.
-ఆధార్ ఆధారిత OTP మీ మొబైల్‌కు వస్తుంది. ఆ OTP ని టైప్ చేసి, మీ ITR స్టేటస్, లావాదేవీ ID ని పొందవచ్చు.
-వెరిఫికేషన్ నిర్ధారణకు సంబంధించి వినియోగదారులు ఇమెయిల్‌ను కూడా పొందుతారు.