- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sobhita Dhulipala: అక్కినేని ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న శోభిత ధూళిపాళ కట్నం ఎంత తీసుకెళ్తుందంటే?
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత దూళిపాళ కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి ఆగస్టు 8న నిశ్చితార్థం(engagement) చేసుకున్నారు. త్వరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే చైతు, శోభిత(Sobhita Dhulipala) ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటి నుంచి వీరికి సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు పెద్దగా ఫేమ్ లేని శోభిత పేరు ఓ రేంజ్‌లో మారుమ్రోగిపోతుంది. అలాగే శోభిత దూళిపాళ(Sobhita Dhulipala)కు సంబంధించిన వార్తలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో.. ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అక్కినేని ఇంటికి పెద్ద కోడలుగా వెళ్లబోతున్న శోభిత ధూళిపాళ కట్నం ఎంత తీసుకెళ్లబోతుందనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. తాజాగా, అందుతున్న సమాచారం ప్రకారం.. శోభిత ధూళిపాళ్ల అక్కినేని(Akkineni) ఇంటికి అసలు కట్నం తీసుకురావడం లేదట. నాగచైతన్య అసలు కట్నం వద్దు బంగారం లాంటి శోభిత ధూళిపాళ్ల మా ఇంటికి వస్తే చాలు అంటూ ముందే శోభిత తల్లిదండ్రులతో చెప్పేశారట. ఇక ఈ విషయంలో అక్కినేని నాగార్జున(Nagarjuna) కూడా మంచి మనసు ఉండాలి కానీ డబ్బు ముఖ్యం కాదు అని ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.