- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండేళ్ల తర్వాత మళ్లీ ఆ ఉత్సాహం.. కేరింతలతో యువత
దిశ ప్రతినిధి, సంగారెడ్డి: కరోనాతో గత రెండేళ్లుగా హోళీకి దూరమైన ప్రజానికం ఈ సారి ఉత్సహంగా పండుగ జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల వారు హోళీ సంబరాల్లో పాల్గొన్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో రెండేళ్లుగా హోళీ జోలికి ఎవరూ పోలేదు. కరోనా ప్రభావం ప్రస్తుతానికి పూర్తిగా తగ్గిపోవడంతో అందరూ ఉత్సాహంగా వీధుల్లోకి వచ్చి రంగులు పూసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. సంగారెడ్డి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీన్మార్ స్టెప్పులతో హోళీ డ్యాన్సులు చేశారు. యువత కేరింతల మధ్య ఉత్సాహంగా హోలీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్ ఎర్రొళ్ల శ్రీనివాస్‌లు హోళీ సంబరాల్లో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ రాజార్షిషా, ఎస్పీ రమణకుమార్‌లకు చింతా ప్రభాకర్ రంగులు పూసి మిఠాయిలు తినిపించారు.
పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హోలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గజ్వేల్‌లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి హోళీ సంబరాల్లో పాల్గొన్నారు. దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు కార్యకర్తలు, సన్నిహితులతో కలిసి హోళీ ఆడారు. ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, నారాయణఖేడ్, జహీరాబాద్, అందోలు, నర్సాపూర్, మెదక్ ఇలా అన్ని చోట్ల అన్ని వర్గాల వారు హోళీ జరుపుకున్నారు. గురువారం రాత్రి కామదహనం చేశారు. ఆటపాటలు, కేరింతలు, తీన్మార్ డ్యాన్సుల మధ్య హోళీ సంబరాలు ఘనంగా జరిగాయి.