సంస్థ చైర్మన్, సీఈఓ బాధ్యతలను వేరు చేసిన హిందుస్థాన్ యూనిలీవర్!

by Disha Desk |
సంస్థ చైర్మన్, సీఈఓ బాధ్యతలను వేరు చేసిన హిందుస్థాన్ యూనిలీవర్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) సంస్థలోని బోర్డు ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) స్థానాలను వేరు చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ మార్పు ప్రస్తుత ఏడాది మార్చి 31 నుంచి అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ప్రస్తుతం సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నితిన్ పరంజ్‌పే ఉంటారని, సీఈఓ, ఎండీగా సంజీవ్ మెహతా కొనసాగుతారని పేర్కొంది. హెచ్‌యూఎల్ నామినేషన్ అండ్ రెమ్యూనరేషన్ కమిటీ పరంజ్‌పే నియామకాన్ని బోర్డుకు సిఫార్సు చేసిందని, దీనికి ఆమోదం లభించిందని కంపెనీ పేర్కొంది. పరంజ్‌పే చీఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా కొత్త బాధ్యతలను తీసుకోనున్నారు. వ్యాపార అభివృద్ధికి ఆయన బాధ్యతలు ఎంతో కీలకమని కంపెనీ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed