- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'హిజాబ్'ను విద్యా సంస్థల వెలుపల ఉంచాలి: కర్ణాటక ప్రభుత్వం
బెంగళూరు: మత ఆచారాలను విద్యాసంస్థల బయటే ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం తరుఫు న్యాయవాది ప్రభులింగు నవడ్గి కోర్టుకు తెలిపారు. హిజాబ్ తప్పనిసరి మత ఆచారం కాదనే వాదనపై తాము నిలబడుతామని మరోసారి స్పష్టం చేశారు. రాజ్యాంగ సభలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 'మతపరమైన సూచనలను విద్యా సంస్థల వెలుపల ఉంచుకుందాం' అని అన్నారనే విషయాన్ని గుర్తు చేశారు.
హిజాబ్ ధరించి విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థినులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏడవ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ముందుగా చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థీ హిజాబ్ నిషేధంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. ఏజీ స్పందిస్తూ విద్యాసంస్థలు అమలు చేస్తున్న నిబంధనలకే దానిని వదిలేసినట్లు చెప్పారు. ఒకవేళ విద్యాసంస్థలు అనుమతిస్తే, ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా? అని అడిగారు.
'ఒకవేళ విద్యాసంస్థలు అనుమతి ఇస్తే, మేము తర్వాతి జరిగే పరిణామాల దృష్ట్యా సాధ్యమైన నిర్ణయం తీసుకుంటాం' అని ఏజీ చెప్పారు. అయితే ఏదో ఒక దానిపై స్పష్టత ఉండాలని చీఫ్ జస్టిస్ పునరుద్ఘాటించారు. 'ప్రభుత్వ ఉత్తర్వులు సంస్థలకు యూనిఫాం నిర్ణయించడానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది. కర్ణాటక విద్యా చట్టం ఉద్దేశ్యం లౌకిక వాతావరణాన్ని పెంపొందించడమే' అని ఆయన వాదించారు. కాగా, విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.