భూమి మొత్తం రోడ్డు కింద పోతుందని భయంతో ఆత్మహత్య

by Vinod kumar |
భూమి మొత్తం రోడ్డు కింద పోతుందని భయంతో ఆత్మహత్య
X

దిశ. ముత్తారం : ఓ రైతు వ్యవసాయంలో పెట్టుబడి కోసం.. కుటుంబ అవసరాల తీర్చేందుకు సెంట్రింగ్ చెక్క ట్రాలీ ఆటో కోసం.. చేసిన అప్పులు తీరకముందే.. తన భూమి హైవేలో పోతుందన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముత్తారం మండలంలోని ముత్తారం కుమ్మరి పల్లె గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.


కుటుంబ సభ్యులు, ముత్తారం ఎస్ఐ బేతి రాములు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ముత్తారం కుమ్మరి పల్లె గ్రామానికి చెందిన సముద్రాల సమ్మయ్య(40) అనే వ్యక్తి వ్యవసాయంతో పాటు సెంట్రింగ్ ట్రాలీ ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. తనకున్న ఎకరం వ్యవసాయ భూమి సరే నెంబర్ 930లోని 34గుంటల 933లోని 7గుంటల భూమి. నాగపూర్ టు విజయవాడ వెళ్తున్న నేషనల్ హైవేలో పోతున్నందని.. బతికే మార్గం లేక జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు.


కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా డాక్టర్ పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో పెద్ద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed