రష్మిక ఆ హీరోతో సినిమా ఒప్పుకుని తప్పుచేసిందా?

by Nagaya |
రష్మిక ఆ హీరోతో సినిమా ఒప్పుకుని తప్పుచేసిందా?
X

దిశ, సినిమా : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న చేతి నిండా సినిమాలతో కెరీర్‌లో చాలా బిజీగా ఉంది. తెలుగు, తమిళ్ సహా హిందీలోనూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ప్రస్తుతం తను బాలీవుడ్‌లో చేస్తున్న 'మిషన్ మజ్ను, గుడ్ బై' చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. టైగర్ ష్రాఫ్‌తో మరో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇవే కాక రణబీర్ కపూర్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'యానిమల్' చిత్రంలో నటిస్తున్న రష్మిక.. ఆ ప్రాజెక్ట్ తనకు టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకంతో ఉంది. ఇక కోలీవుడ్‌‌లో 'వారసుడు' మూవీలో దళపతి విజయ్ సరసన చాన్స్ కొట్టేసిన బ్యూటీ అక్కడ కూడా జెండా పాతేందుకు సిద్ధమైంది. తెలుగులో 'పుష్ప 2' ఉండనే ఉంది.

ఇదే క్రమంలో రష్మిక సీనియర్ తమిళ హీరో విక్రమ్‌తో ఓ సినిమాకు సైన్ చేసిందన్న వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే విక్రమ్ వయసు 56 ఏళ్లు కాగా.. ప్రజెంట్ యంగ్ జనరేషన్ హీరోయిన్స్ ఎవరూ అతనికి జంటగా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఈ నేపథ్యంలో విక్రమ్-రష్మిక జోడీ కూడా మిస్ మ్యాచ్ అవుతుందని భావిస్తున్న అభిమానులు.. హీరోయిన్‌గా కాకుండా ఇంకేదైనా ఇంపార్టెంట్ రోల్ అయితే బెటర్ అని సూచిస్తున్నారు.

Advertisement

Next Story