దేశంలో దుర్వినియోగ మవుతున్న మతస్వేచ్ఛ: ఆర్ఎస్ఎస్

by Mahesh |   ( Updated:2022-03-12 14:33:15.0  )
దేశంలో దుర్వినియోగ మవుతున్న మతస్వేచ్ఛ: ఆర్ఎస్ఎస్
X

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు మతోన్మాదం పెరుగుతుందని ఆరెస్సెస్ పేర్కొంది. రాజ్యాంగం, మత స్వేచ్ఛ ముసుగులో ఇది కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు శనివారం విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆరెస్సెస్ వెల్లడించింది. ఈ ముప్పును ఓడించడానికి, వ్యవస్థీకృత శక్తి తో అన్ని ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చింది. 'దేశంలో పెరుగుతున్న మత ఛాందసవాదం చాలా చోట్ల మళ్లీ తలెత్తింది. కర్ణాటక, కేరళలో జరిగిన హిందూ కార్యకర్తల దారుణమైన హత్య లే దీనికి ఉదాహరణ. మతపరమైన ఉన్మాదం, ర్యాలీలు, ప్రదర్శనలు, రాజ్యాంగం, మత స్వేచ్ఛ ముసుగులో సామాజిక క్రమశిక్షణ, ఆచారాలు, సంప్రదాయాల ఉల్లంఘన జరుగుతుంది.

దీంతో స్వల్ప కారణాలతో హింసను ప్రేరేపించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి చర్యలు పెరుగుతున్నాయి' అని నివేదికలో పేర్కొంది. వ్యవస్థీకృత యంత్రాంగంలోకి ప్రవేశించేందుకు ఓ వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. దీని వెనుక దీర్ఘకాల ప్రణాళికలు ఉన్నాయని వెల్లడించింది. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో హిందువుల మత మార్పిడిలకు నిరంతరం వ్యూహాలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ధోరణిని అడ్డుకునేందుకు హిందూ సమాజంలోని సామాజిక, మతపరమైన నాయకత్వం, సంస్థలు కొంతమేర మేల్కొని క్రియాశీలకంగా మారుతున్నాయని వెల్లడించింది.

Advertisement

Next Story