- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వింత వాహనంపై వరుడి పెళ్లి ఊరేగింపు.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
దిశ, ఫీచర్స్ : ప్రతి ఒక్కరి జీవితంలో కల్యాణం అత్యంత కీలక ఘట్టంగా పరిగణించబడుతుంది. అందుకే వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా జరుపుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ అపురూప దృశ్యం కలకాలం గుర్తుండిపోయేలా యూనిక్ థాట్స్, అరేంజ్మెంట్స్తో బంధుమిత్రులను ఆశ్చర్యపరుస్తుంటారు. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లి సంబరాల్లో వెలుగుచూస్తున్న విచిత్ర విన్యాసాలు ట్రెండ్ సృష్టించడం చూస్తున్నాం. ప్రస్తుతం ఓ వరుడు కూడా తన పెళ్లి ఊరేగింపును వింతగా ప్లాన్ చేయగా.. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని లక్ష్మణ్‌పూర్-శంకర్పూర్ గ్రామంలో ఓ వరుడు తన వివాహ ఊరేగింపు వేడుకలకు కారుకు బదులుగా.. పూలతో అలంకరించిన బుల్డోజర్ ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు 'బుల్డోజర్ బాబా కీ జై' అంటూ అతడు చేసిన నినాదాలు గ్రామ ప్రజలందరినీ ఆశ్చర్యపరచగా.. వారంతా ఆ బుల్డోజర్తో సెల్ఫీలు దిగేందుకు పరుగులు తీయడం విశేషం. కాగా ఆ ఆలోచన గురించి పంచుకున్న వరుడు.. 'నేను నా వివాహాన్ని ఒక చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకున్నా. ఈ ఆలోచన భిన్నంగా ఉండటంతో అదే ఫాలో అయ్యాను' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ బుల్డోజర్ ఫొటో వైరల్ అవుతోంది.