- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామినేని టూ కిమ్స్ @ 16 మినిట్స్.. అవయవ మార్పిడి కోసం గ్రీన్ ఛానల్
దిశ, ఎల్బీనగర్: సకాలంలో అవయవ మార్పిడి కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు. మంగళవారం బ్రెయిన్ డెడ్ కు గురైన ఓ వ్యక్తి అవయవాలు ( గుండె, ఊపిరితిత్తులు) ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట్‌లోని కిమ్స్ హాస్పటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌ను సిద్ధం చేశారు. దీంతో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కేవలం 16 నిమిషాల్లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఉదయం 10.01 గంటలకు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి బయల్దేరిన అంబులెన్స్‌కు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో 10 గంటల 17 నిమిషాలకు అంబులెన్స్ కిమ్స్ హాస్పిటల్ కు చేరుకుంది. 17.6 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లో చేరుకునేలా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి.. సేవలందించిన రాచకొండ ట్రాఫిక్ పోలీసులను హాస్పిటల్స్ యాజమాన్యం, రాచకొండ సీపీ మహేష్ భగవత్ అభినందించారు.