Governor Tamilisai: ఈ రాత్రికే భద్రాచలానికి గవర్నర్.. ట్రైన్‌లో జర్నీ!

by GSrikanth |   ( Updated:2022-07-16 12:52:15.0  )
Governor Tamilisai is Going to Bhadrachalam to visit flooded Areas
X

దిశ, తెలంగాణ బ్యూరో: Governor Tamilisai is Going to Bhadrachalam to visit flooded Areas| రాష్ట్ర గవర్నర్​తమిళి సై భద్రాచలానికి ప్రయాణం కానున్నారు. ఈ రోజు రాత్రి లేదా ఆదివారం నాడు ట్రైన్‌లో వెళ్లనున్నట్లు తెలిపారు. వరద ప్రాంతాల్లో పర్యటించి ముంపు బాధితుల కష్టాలను తెలుసుకోనున్నారు. అక్కడ అందుతున్న చర్యలను పర్యవేక్షించనున్నారు. దీంతో పాటు మెడికల్ క్యాంపులలో కూడా భాగస్వామ్యం కానున్నారు. ఈ మేరకు రెడ్​క్రాస్, ఈఎస్ఐ డాక్టర్లను కూడా వెంట పెట్టుకొని తీసుకువెళ్లనున్నారు. అమీర్‌పేట్ అర్బన్​ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో బూస్టర్​డోసు తీసుకున్న ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడి వ్యాక్సిన్లతోనే సాధ్యమన్నారు. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 75 రోజుల బూస్టర్​డోసు డ్రైవ్​ను ప్రకటించిన పీఎం మోడీకి గవర్నర్​ థాంక్స్ చెప్పారు.

ఇది కూడా చదవండి: తక్షణమే తెలంగాణకు రూ.2000 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి రేవంత్ లేఖ

Advertisement

Next Story