Governor Tamilisai: బోనమెత్తిన గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-07-23 10:27:49.0  )
Governor Tamilisai Celebrates Bonalu Festival in Rajbhavan
X

దిశ, డైనమిక్ బ్యూరో: Governor Tamilisai Celebrates Bonalu Festival in Rajbhavan| హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో అమ్మవారి ఆలయంలో బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. రాజ్‌ భవన్‌లోని కుటుంబాలతో కలిసి గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌ ఉత్సవంలో పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని రాజ్‌భవన్ ప్రాంగణంలోని ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షబీభత్సం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతికి బోనాల పండుగ ప్రతీక అని అన్నారు. ఆషాఢ, శ్రావణ మాసంలో ఇక్కడి ప్రజలు బోనాల ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని, రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇది కూడా చదవండి: నువ్ చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధం

Advertisement

Next Story