Good news For Movie Lovers: ఈసారి దసరాకు ఏకంగా 6 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయోచ్

by Kavitha |   ( Updated:2024-10-09 08:26:50.0  )
Good news For Movie Lovers: ఈసారి దసరాకు ఏకంగా 6 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయోచ్
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా వస్తుందంటే చాలు ఇంటిల్లి పాది చుట్టాలు, పిండి వంటలు, చుక్క ముక్కతో ఇల్లంతా పండగ వాతావరణంతో కళకళలాడిపోతుంది. అంతేకాదండోయ్ దసరా అంటే గుర్తొచ్చే మరొక విషయం కొత్త సినిమా. ఇక న్యూ మూవీ రిలీజయినప్పుడు అందరూ థియేటర్స్‌కి వెళ్లి మరీ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ దసరా ఫెస్టివల్‌కు ఏకంగా 6 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘వేట్టయన్’ ఈ నెల 10న విడుదలవనుంది. అలాగే 11వ తేదీన సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’, గోపీచంద్ నటించిన ‘విశ్వం’, బాలీవుడ్ బ్యూటీ నటించిన ‘జిగ్రా’, ధృవ సర్జా నటించిన ‘మార్టీన్’ వంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాగా సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ మూవీ అక్టోబర్ 12న అనగా దసరా పండుగ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మీరు వీటిలో ఏ మూవీకి వెళ్లాలనుకుంటున్నారు.

Advertisement

Next Story