- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభిమానులకి గుడ్ న్యూస్..! తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో..?
దిశ, సినిమా: ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే విధంగా ఉన్న సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇతని వ్యక్తిగత విషయానికి వస్తే బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్త, ఇంటిరియర్ డిజైనర్ అనూష శెట్టిని నవంబర్ 20, 2022 న పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతనికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. నాగశౌర్య త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందబోతున్నాడట. అయితే ఈ విషయాన్ని కేవలం ఫ్యామిలీ మెంబర్స్‌కి మాత్రమే తెలియజేశారట. ఇక ఫ్రెండ్స్‌కి కూడా తెలీదట. త్వరలోనే దీనిపై నాగ శౌర్య అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నాడట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు.