- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య 73 శాతం పెరిగిన బంగారం దిగుమతులు!
దిశ, వెబ్‌డెస్క్: అధిక డిమాండ్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో కరెంట్ ఖాతా లోటుపై ప్రభావం చూపించే బంగారం దిగుమతులు సుమారు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ డాలర్ల(రూ. 3.46 లక్షల కోట్ల)కు చేరుకుందని కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పసిడి దిగుమతుల విలువ రూ. 2.04 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మాత్రమే బంగారం దిగుమతులు 11.45 శాతం క్షీణించి 4.7 బిలియన్ డాలర్లు(రూ. 36 వేల కోట్లు)గా ఉన్నాయి. అలాగే, సమీక్షించిన 11 నెలల కాలంలో బంగారం దిగుమతులు పెరగడంతో కరెంట్ ఖాతా లోటు 176 బిలియన్ డాలర్ల(రూ. 13.5 లక్షల కోట్ల)గా నమోదయ్యాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్ కారణంగా దిగుమతులు పెరిగి కరెంట్ ఖాతా లోటుపై మరింత ఒత్తిడి కలిగించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో రత్నాభరణాల ఎగుమతులు 57.5 శాతం పెరిగి 35.25 బిలియన్ డాలర్ల(రూ. 2.70 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. 'ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య బంగారం నెలవారీ సగటు దిగుమతులు ఇప్పటికీ 76.57 టన్నులుగా ఉన్నాయి. ఇది సాధారణ స్థాయి కంటే చాలా తక్కువ. పరిమాణం పరంగా ఈ కాలంలో మొత్తం 842.28 టన్నుల దిగుమతులు జరిగాయని రత్నాభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి(జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా అన్నారు.