కేబినెట్‌‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. 12కు చేరిన మంత్రుల సంఖ్య

by Manoj |
కేబినెట్‌‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. 12కు చేరిన మంత్రుల సంఖ్య
X

పనాజీ: గోవా సీఎం ప్రమోద్ సావంత్ తన మంత్రివర్గంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. నీల్కాంత్ హలాంకర్, సుభాష్ ఫల్దేశాయ్‌తో పాటు మిత్రపక్షం మహారాష్ట్రవాదీ గోమాంతక్ పార్టీకి చెందిన సుదీన్ ధవలికర్‌లు నూతన మంత్రులుగా తీసుకున్నారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ లో గవర్నర్ శ్రీధరన్ పిళ్లై సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

తాజా మంత్రులతో గోవాలో కేబినెట్ సభ్యుల సంఖ్య 12కు చేరింది. కాగా ఎంజీపీకి చెందిన ధవలికర్ మనోహర్ పారికర్ హయాంలోనూ మంత్రిగా పనిచేశారు. ఇక ఫల్దేశాయ్ మొదటి సారిగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 స్థానాల్లో గెలుపొందింది. స్థానిక పార్టీలు, స్వతంత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story