- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్‌లోకి దూసుకెళ్లిన భారత మిసైల్: విచారణకు ఆదేశించిన కేంద్రం
న్యూఢిల్లీ: భారత్‌కు ప్రయోగించిన మిసైల్ పొరపాటున పాకిస్తాన్ భూభాగంలో పడిన ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. 'ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఉన్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించింది' అని పేర్కొంది. ఇది పొరపాటున జరిగిన ఘటనగా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. సాంకేతిక సమస్యతోనే ఇలా జరిగిందని.. విచారం తెలియజేసింది. ఈ ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయమని పేర్కొంది. పాకిస్తాన్ దీనిపై సమగ్ర, పారదర్శకమైన నివేదిక అందివ్వాలని భారత్‌ను కోరింది. మార్చి 9న సాయంత్రం భారత్‌లోని సూరత్‌గఢ్ నుండి పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన భారతీయ సంతతికి చెందిన సూపర్-సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని పాక్ ఆరోపించింది. దాదాపు 100 కిలోమీటర్లు సరిహద్దు దాటి లోనికి వచ్చిందని తెలిపింది. కాగా ఈ మిసైల్ ప్రయోగంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని మియన్ చన్ను నగరంలో పౌర ఆస్తులకు నష్టం వాటిల్లింది.