షాద్ నగర్ రైలు పట్టాలపై బాలిక ఆత్మహత్య..

by Mahesh |
షాద్ నగర్ రైలు పట్టాలపై బాలిక ఆత్మహత్య..
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట రైల్వే గేట్ సమీపంలో రైలు పట్టాలపై పదహారేళ్ల బాలిక గాయత్రి అనుమానాస్పద రీతిలో శవం గా లభించింది. రైల్వే పట్టాలపై మంగళవారం ఉదయం ముక్కలైన గాయత్రి శవాన్ని స్థానికులు కనుగొన్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి వద్ద బ్యాగులో లభించిన హాల్ టికెట్ ఆధారాల ప్రకారం మందరి గాయత్రి, తండ్రి చిన్న కిష్టయ్య, తల్లి సరస్వతి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామం గా గుర్తించారు. అసలు గాయత్రి ఆత్మహత్యకు పాల్పడిందా? ఏదైనా అఘాయిత్యం జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story