ఫుల్లుగా తాగి నడుస్తున్న కారుపై డ్యాన్స్.. రూ. 20 వేల ఫైన్ (వీడియో)

by S Gopi |   ( Updated:2022-04-02 07:53:54.0  )
ఫుల్లుగా తాగి నడుస్తున్న కారుపై డ్యాన్స్.. రూ. 20 వేల ఫైన్ (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో పలువురు యువకులు హల్ చల్ చేశారు. రాత్రి సమయంలో ఫుల్లుగా తాగి నడుస్తున్న కారుపై డ్యాన్స్ చేశారు. అదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు భారీగా ఫైన్ విధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ లోని ఇండస్ట్రియల్ ఏరియాలో సెక్టార్ నెంబర్ 13 లో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో బ్రిడ్జ్ పై కొంతమంది యువకులు హల్ చల్ చేశారు. ఫుల్లుగా తాగి నడుస్తున్న కారు పైకప్పుపై నిలబడి డ్యాన్సులు చేశారు. ఇది గమనించిన పలువురు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసి స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ఆ వెహికల్ యజమానికి రూ. 20 వేల ఫైన్ విధించారు. అదేవిధంగా అతడి లైసెన్సును కూడా రద్దు చేసినట్లు సమాచారం. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story