- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Ashika Ranganath: ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉండండి.. యంగ్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అషికా రంగనాథ్(Ashika Ranganath) ‘నా సామి రంగ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇందులోని ఆమె నటనకు సినీ ప్రియులంతా ఫిదా అయిపోయారు. ఇక ‘నా సామి రంగ’(Naa Saami Ranga) చిత్రంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. వరుస ప్రాజెక్ట్స్‌లో ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’(Viswambhara) సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే కోలీవుడ్ హీరో సిద్దార్ధ్‌తో ‘మిస్ యు’(miss you) మూవీ చేస్తుంది. అయితే ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.
7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శామ్యూల్ మాథ్యూ(Samuel Matthew) ఈ సినిమాను నిర్మిస్తుండగా.. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, అషికా రంగనాథ్(Ashika Ranganath) ‘మిస్ యు’ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నవంబర్ 12న ఉదయం 11 గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ ‘‘ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉండండి. మిస్ యు మూవీ మీ సమీప థియేటర్‌లో నవంబర్ 29న వచ్చేస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే పోస్టర్‌లో ఓ రెస్సారెంట్‌లో సిద్ధార్థ్ మాట్లాడుతుండగా.. అషికా కోపంగా చూస్తున్నట్లు కనిపించింది.
Read More ...