గాయత్రిని హత్య చేశారా..? లేక ఆత్మహత్య చేసుకుందా..?

by Mahesh |
గాయత్రిని హత్య చేశారా..? లేక ఆత్మహత్య చేసుకుందా..?
X

దిశ, అచ్చంపేట : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కేశంపేట రైల్వే గేట్ పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్న కమ్మదనం గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గాయత్రి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరి వాని పల్లి బలవన్మరణమా.. లేక ఆత్మహత్యనా.. లేక ఎవరైనా చంప్పీ ఉంటారా..? లేక ఏదైనా బలమైన కారణం ఉంటుందని గాయత్రి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు ఉన్నాయనే కోణంలో బుధవారం "దిశ పత్రిక" ప్రచురణ ద్వారా అందరినీ అలోచింప్ప చేసిన విషయం విధితమే.

గాయత్రి సోమవారం రాత్రి హైదరాబాద్ లో ఉన్నది..

గాయత్రి ఆదివారం నాడు కల్వకుర్తి లో ట్రైబల్ వెల్ఫేర్ పరీక్ష రాయడానికి వెళ్ళింది. తదుపరి తన సొంత ఊరికి వెళ్లి అక్కడ నుంచి సోమవారం నాడు అచ్చంపేట వచ్చిన తర్వాత అక్కడ నుండి ఒక క్లుజర్ జీప్ ద్వారా హైదరాబాద్ కు బయలుదేరినట్టు అచ్చంపేట పోలీసులు పట్టణం లోని సీసీ ఫుటేజుల ద్వారా గుర్తించినట్లు మృతురాలి బంధువులు ద్వారా సమాచారం తెలిసింది. హైదరాబాద్ లో తనకు తెలిసిన తన సొంత ఊరికి చెందిన ఒక వ్యక్తి వద్ద రోజు రాత్రి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఆ వక్తిని విచారిస్తున్న పోలీసులు..!

మృతురాలు గాయత్రి గతంలో తాను కోవిడ్ కారణంగా ఆన్లైన్ తరగతులు వినేందుకు స్మార్ట్ ఫోన్ లో వాడటం వలన ఆ ఫోన్ లో ఉన్న కొన్ని అనుమానిత ఫోన్ నెంబర్లను పోలీసులకు తెలపడంతో ఆ దిశగా అచ్చంపేట పోలీసులు విచారణ మరింత ముమ్మరం చేశారు. తల్లీదండ్రుల అనుమానాలతో మృతురాలి సొంత ఊరికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. విచారణలో ఆ వ్యక్తి సోమవారం రాత్రి హైదరాబాదుకు నా వద్దకు వచ్చిందని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు.. మంగళవారం ఉదయం షాద్ నగర్ వద్ద వదిలి పెట్టానని..? తదుపరి ఏమైందో తనకు తెలియదని..? అలాగే మృతురాలు గాయత్రి చెల్లి లేదా మరదలు కావాలని రెండు మాటలు చెప్పినట్లు తెలిసింది.

తల్లీదండ్రుల అనుమానాలకు బలం..

గాయత్రి అంత ఈజీగా చనిపొదని.. ఇందులో ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని కుటుంబ సభ్యులు గట్టిగా ఆరోపించారు. అనుమానంతో ఒక వ్యక్తిని విచారించిన పోలీసులకు దాదాపు గాయత్రి అనుమానిత మృతికి కారణాల్ని తెలుసుకోవడం లో సఫలీకృతులయ్యారనీ చెప్పవచ్చు. అనుమానించిన వ్యక్తి ద్వారా వచ్చిన సమాచారంతో కుటుంబ సభ్యుల ఆరోపణలకు మరింత బలం చేకూరుతుంది. గాయత్రిని హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గాయత్రి మరణ హిస్టరీనీ చేధించేందుకు అచ్చంపేట పోలీసులు విచారణలో వేగం పెంచారు.

Advertisement

Next Story