కూతురితో రొమాన్స్ చేస్తున్న బాలీవుడ్ కొరియోగ్రాఫర్

by samatah |
కూతురితో రొమాన్స్ చేస్తున్న బాలీవుడ్ కొరియోగ్రాఫర్
X

దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కో-డ్యాన్సర్‌ను లైంగికంగా వేధించిన కేసులో రీసెంట్‌గా అతనిపై పలు సెక్షన్ల కింద చార్జ్ షీట్ నమోదైన సంగతి తెలిసిందే. అయితే ప్రొఫెషనల్లీ అద్భుతమైన కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న గణేష్.. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ అనేక సినిమాలకు పనిచేశాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'ఊ.. అంటావా మావ' సాంగ్‌కు కంపోజ్ చేసిన డ్యాన్స్ మూవ్స్‌‌.. మాస్ ఆడియన్స్‌ను కేక పెట్టించాయి. ఇదిలా ఉంటే, గణేష్ ఇటీవల తన కూతురుతో చేసిన డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకించి ఆమెతో వేసిన రొమాంటిక్‌ స్టెప్పులపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. దీన్ని ప్రొఫెషనల్ కోణంలోనే చూడాల్సిన అవసరమున్నా.. చూసేవాళ్లకు కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నందున నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Advertisement

Next Story