వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మిత్రులు... (వీడియో)

by Nagaya |   ( Updated:2023-04-01 15:30:54.0  )
వధూవరులకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మిత్రులు... (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : పెళ్లిలో వధూవరులకు బహుమతులు ఇవ్వడంలో కొత్తగా ఆలోచిస్తూ ట్రెండ్ ఫాలో అవుతుంది నేటి యువత. పరిస్థితులకు అనుగుణంగా సరికొత్తగా ఆలోచించి డిఫారెంట్ గా ట్రై చేస్తున్నారు యువ అతిథులు. కూరగాయల ధర రేట్లు పెరిగినప్పుడు టమాట, ఉల్లిపాయలు, పెట్రోల్ ధరలు పెరిగితే పెట్రోల్ బాటిల్స్ గిఫ్ట్ ఇస్తూ ఔరా అనిపిస్తున్నారు. తాజాగా వధూవరులకు ఓ వినూత్న బహుమతి ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ యువత. ఏపీలో కరెంట్ కోతలు విధించిన నేపథ్యంలో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. పల్లెలో, పట్టణాలల్లో విద్యుత్ ఉండడం లేదు. ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఈ విద్యుత్ కోతలకు నిరసనగా పెళ్లికి వెళ్లిన మిత్రులు ఊహించని విధంగా గిఫ్టును ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అందమైన ప్యాక్ చేసిన పెద్ద బహుమతిని ఇవ్వడంతో దంపతులిద్దరు ఆనందంతో ఆ గిఫ్ట్ కవరును తెరిచారు. విసన కర్రలు ఉన్న ఆ గిఫ్ట్‌ను చూసి వధూవరుడు, పెళ్లికి వచ్చిన అతిథులు నవ్వులు చిందించారు. ఏపీలోని కరెంట్ కోతలను అందరికీ తెలియజేయడానికే పెళ్లిలో దంపతులకు విసన కర్రలను బహుమతిగా ఇచ్చినట్లు యువకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

Advertisement

Next Story

Most Viewed