- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-1 అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్‌తో పాటు నెలకు రూ.5 వేల స్టైఫండ్
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రూప్-1 (మెయిన్స్) పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రం (టీజీబీసీఈఎస్‌డీటీసీ) డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 75 రోజులపాటు నిర్వహించే శిక్షణ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. శిక్షణ పొందాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తును www.tgbcstudycircle.cgg.gov.inలో సమర్పించాలన్నారు. దరఖాస్తు చేసే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల్లోపు ఉండాలన్నారు.
రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికైన వారికి శిక్షణ కాలంలో నెలకు రూ.5000 ఉపకార వేతనం (బుక్ ఫండ్, రవాణా సహ) అందజేస్తారన్నారు. ఉచిత శిక్షణ హైదరాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ సర్కిల్ (రోడ్ నెం: 8, లక్ష్మీనగర్), ఖమ్మంలోని టీజీ బీసీ స్టడీ సర్కిల్‌లో అందజేస్తారన్నారు. మరింత సమాచారం కోసం ఫోన్ నెంబర్ 040-24071188లో సంప్రదించాలనీ పేర్కొన్నారు.