విద్యార్థుల కోసం ఫ్రీ ఆర్మీ స్కూల్..కీలక నిర్ణయం తీసుకున్న సీఎం

by Mahesh |
విద్యార్థుల కోసం ఫ్రీ ఆర్మీ స్కూల్..కీలక నిర్ణయం తీసుకున్న సీఎం
X

ఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల కోసం ఆర్మీ పాఠశాలను నిర్మించి ఉచితంగా చదువు, ట్రెయినింగ్ ఇప్పించనున్నట్టు మంగళవారం పేర్కొన్నారు. ఢిల్లీలోని జారోడ కలాన్ ప్రాంతంలో 14 ఎకరాల విస్తీర్ణంలో ఆర్మీ స్కూల్ నిర్మాణంతో పాటు బాలికలు, బాలురకు వేర్వేరుగా వసతి గృహాలు కూడా నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఈ స్కూల్లో ఢిల్లీని ఆనుకుని నివసించే ప్రాంతాల ప్రజల పిల్లలకు ఉచితంగా అడ్మిషన్ ఇస్తామని, వీరి నుంచి ఎటువంటి ఫీజులు తీసుకోమని చెప్పారు. దీనికి స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్టు స్పష్టం చేశారు. ఇందులో 9,11వ తరగతి విద్యార్థులు అడ్మిషన్ పొందేందుకు అర్హులు. మొత్తం 200 సీట్లు ఉండగా ఒక్కో తరగతి గదిలో 100 మంది చొప్పున విద్యను అభ్యసించవచ్చని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

ఈ ఏడాది చివర్లో తరగతులు ప్రారంభించనున్నట్టు తెలిపిన కేజ్రీవాల్ ఇప్పటికే 18 వేల దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. 23 మార్చి 1931లో స్వాతంత్ర్యం కోసం ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేశ్ వర్ధంతి సందర్భంగా పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు.అయితే, ఈ పాఠశాలలో సీటు పొందాలనుకునే 9వ తరగతి విద్యార్థులకు మార్చి-27న ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు.11వ తరగతి వారికి నిర్వహించే పరీక్ష కోసం మరుసటి రోజు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.ఇక సెకండ్ ఫేజ్‌లో ఇంటర్య్యూ ప్రక్రియ ఉంటుందన్నారు. ఆర్మీలో పని చేసి ఉద్యోగ విరమణ పొందిన ఆర్మీ, నేవీ, వాయుసేన అధికారులు ఈ ఆర్మీ పాఠశాలలో విద్యార్థులకు బోధిస్తారని సీఎం కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. 20 డిసెంబర్ 2021లో ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది ఆర్మీ పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story