మహాముత్తారం మండలంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

by Mahesh |
మహాముత్తారం మండలంలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన
X

దిశ, మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల మండలం అయిన మహా ముత్తారం మండలంలోని అడవి గ్రామంలో మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పర్యటించి పలు గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శనివారం అర్ధరాత్రి పలిమెల మండలంలోని ముకునూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిద్రించిన శ్రీధర్ బాబు ఆదివారం ఉదయం మహాముత్తారం మండలం లోని రెడ్డి పల్లె పెగడపల్లి సింగారం స్తంభం పల్లి గ్రామంలో పలు గ్రామాల్లో పర్యటించి వేసవి కాలంలో వారికి ఉండే సమస్యలపై ఆరా తీశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. సమస్యలు తీర్చడానికి తాను ముందు ఉంటానని పలు గ్రామాల ప్రజలకు హామీ ఇచ్చారు.

అంతేగాక ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వము ఉద్యోగ ప్రకటన చేసినందున నిరుద్యోగులైన యువకులకు ఉద్యోగ పరీక్షలకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేసినట్లు ఆయన ఈ సందర్భంగా పలు గ్రామాల్లో యువకులకు. తెలియజేశారు. మహముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మహాముత్తారం జెడ్పీటీసీ లింగమల్ల శారద, మాజీ జెడ్పీటీసీ మేడిపల్లి సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు చీమల సందీప్, గజాల అశోక్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed