- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ కార్మికశాఖ మంత్రిపై సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. గుమ్మనూరు జయరాం అనేక అక్రమాలకు పాల్పడ్డారని అందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. కార్మిక శాఖను మంత్రి గుమ్మనూరు జయరాం కమీషన్ల శాఖగా మార్చేశారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం మూడేళ్లలో రూ.735 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కార్మికులకు గంజి కూడా లేకుండా చేసి బెంజిలో తిరిగిన వ్యక్తి గుమ్మనూరు జయరాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామిక వేత్తలను బెదిరించి భూ కబ్జాలకు పాల్పడటం.. ఈఎస్ఐలలో కౌంటర్లు పెట్టి జే ట్యాక్స్ వసూళ్లు చేయడం, పేకాట క్లబ్బులు, సారా దుకాణాలు నిర్వహించడమే పనిగా పెట్టుకున్నారంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
'జే' ట్యాక్స్ వసూళ్లు..
కార్మికులకు గంజి కూడా లేకుండా చేసి బెంజిలో తిరిగిన వ్యక్తి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 'ఈఎస్ఐ వైద్య సిబ్బంది వయో పరిమితిని 60 నుండి 63కి పెంచుతామని రూ.6 కోట్లు, ఈఎస్ఐ మందుల సప్లయర్స్ నుండి రూ.140 కోట్లు, రిఫరల్ ఆస్పత్రులకు బిల్లుల మంజూరులో కమీషన్లు రూ.28 కోట్లు, రిఫరల్ ఆస్పత్రుల ఎన్ ప్యాల్ మెంట్ రూ.5 కోట్లు కాజేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే కార్మిక శాఖలోని కార్మికుల ఇన్సూరెన్స్‌లో అక్రమాలు చేసి రూ.17 కోట్లు గుంజుకున్నారు.
భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్‌లో పారిశ్రామికవేత్తలను బెదిరించి భూకబ్జాలకు పాల్పడ్డారు. పేదలకు వైద్యం అందించే ఈఎస్‌ఐలలో కౌంటర్లు పెట్టి జే ట్యాక్స్ వసూలు చేశారు. జయరాం మంత్రి పదవి అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదించుకున్నాడు. జయరాం కార్మిక శాఖ మంత్రిగా ప్రజలకు ఉపాధి చెప్పలేదు గానీ తాగుడుకు బానిసలు చేశారు' అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
డబ్బు కోసం సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తారా..?
కేవలం కార్మిక శాఖతోపాటు సొంత నియోజకవర్గంలోనూ వసూళ్ల పర్వం కొనసాగించారంటూ.. కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'నియోజకవర్గంలో ఏదైనా ఒక చిన్న రోడ్డు కాంట్రాక్ట్ నుంచి తన శాఖలో ఏ పని జరిగిన అందులో భారీ మొత్తంలో ఆయనకు కమిషన్ ఇవ్వాల్సిందే. మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గం లో పేకాట క్లబ్బులు, సారా దుకాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. తన నియోజకవర్గంలో పేకాట శిబిరాలు, నాటు సారా తయారీ కేంద్రాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాయి. పేకాట శిబిరాలు, నాటుసారా కేంద్రాలను పెంచి పోషించాడు. మంత్రి నియోజకవర్గం అంటే సంక్షేమం, అభివృద్దిలో ముందు వరుసలో నిలిపి మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి. అవినీతి ముఖ్యమంత్రి జగన్ తన మంత్రులను పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
మంత్రులు అవినీతిలో కూరుకు పోయారు. గుమ్మనూరు జయరాం తన శాఖలో అవినీతిలో కూరుకు పోయారు. ఆయనను కార్మిక మంత్రి అనే కంటే కమీషన్‌ల మంత్రి అనడం సబబుగా ఉంటుంది. కార్మిక మంత్రిగా సంక్షేమాన్ని చూడాల్సిన మంత్రి తన శాఖను అడ్డ పెట్టుకొని తన నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడ్డాడు. నిత్యం వేల కోట్లు సంపాదించాడు. ఈ బెంజి మంత్రి అన్నింటిలోనూ అక్రమాలు, అరాచకాలు, అవినీతితో దోపిడీ చేసాడు. కార్మికులకు ఉపాధి చూపాల్సింది పోయి పేకాట క్లబ్బులు, కల్తీ మద్యం, నాటుసారాలలో కార్యకర్తలకి స్వయం ఉపాధి కల్పించారు.
ఆయన నియోజకవర్గంలో మట్టి, ఇసుక మైనింగ్ పంచ భూతాలను కూడా దోచుకుంటూ వస్తున్నారు. అవినీతికి కొత్త భాష్యం చెప్పారు. ప్రతి దాంట్లో కమిషన్ కావాలి. అవినీతిని పెంచి పోషిస్తున్నాడు. మంత్రి గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా కాకుండా కమీషన్ల మంత్రిగా పేరు పొందారు. పేకాట శిబిరాలు, నాటు సారా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా లూటీ చేయటం సిగ్గుచేటు. వైసీపీ మంత్రులు తమ అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతూ సామాన్య ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. వీటన్నింటిని బయటికి లాగుతాం' అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.