- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఉగ్ర లింకులు.. మాజీ ముఖ్యమంత్రి ఆరోపణ
పట్నా: కాశ్మీర్ ఫైల్స్ చిత్ర నిర్మాతలకు, డైరెక్టర్‌కు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఎన్డీయే ప్రధాన కూటమి భాగస్వామి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఆరోపించారు. రాష్ట్రంలో ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి వినోద పన్ను మినహాయించిన ఒకరోజు తర్వాత 1980లలో కాశ్మీర్ పండిట్ల ఊచకోత, వలసల నేపథ్యంలో తెరకెక్కించిన సినిమాను 'కుట్ర' గా ఆయన అభివర్ణించారు. కాశ్మీర్‌కు తిరిగి రాకుండా పండిట్‌లలో భయాందోళనలను కలిగించడానికి ఉగ్రవాద సంస్థలకు, చిత్ర నిర్మాతలకు మధ్య డీల్ కుదిరిందని ఆరోపిస్తూ మాంఝీ ట్వీట్ శుక్రవారం ట్వీట్ చేశారు.
'కాశ్మీర్ ఫైల్స్ మూవీ కాశ్మీర్ బ్రాహ్మణులలో భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ఉగ్రవాదుల పన్నిన కుట్ర కావొచ్చని.. దీని ద్వారా పండిట్లు తిరిగి కాశ్మీర్‌కు రాలేరు'. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రితో సహా 'ఉగ్రవాద సంస్థలు, ప్రొడ్యూసర్స్‌కు మధ్య సంబంధం ఉండవచ్చు' అని మాంఝీ అన్నారు. ఈ మూవీ యూనిట్, వారి ఉగ్రవాద సంబంధాలపై కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.