కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత.. కారణం అదేనా?

by Vinod kumar |
కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత.. కారణం అదేనా?
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కేంద్రంలోని విద్యా నగర్ లో గల కేజీబీవీ బాలికల పాఠశాలలో బుధవారం ఉదయం విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. మధ్యాహ్నం 30 మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారి దర్యాప్తు జరిపి నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed