- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వండల్ గర్ల్ : చదివేది ఒకటో క్లాస్.. చేసేవి ఏడో తరగతి లెక్కలు!
దిశ, ఫీచర్స్: ఉత్తరప్రదేశ్, వారణాసిలోని బహెర్వా గ్రామంలో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి దృష్టి.. ఏడో తరగతి గణిత సమస్యలను సాల్వ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు తన కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులకు కూడా మ్యాథమెటిక్స్ నేర్పిస్తోంది. ఇలా 'వండర్ గర్ల్'గా ప్రసిద్ధి చెందిన దృష్టి టాలెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వారణాసి పబ్లిక్ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్న ఈ 'వండర్ గర్ల్'.. 2 నిమిషాల 56 సెకన్లలో జాతీయ జెండాలతో సహా అన్ని దేశాలు, వాటి రాజధానుల పేర్లను చెప్పగలిగింది. ఈ మేరకు అత్యంత వేగంగా రీకాల్ చేసిన చిన్నారిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి 'ఇన్‌స్టంట్-లైవ్ ట్యూటరింగ్' ప్లాట్‌ఫామ్‌గా ప్రసిద్ధి చెందిన 'ఫిలో' ద్వారా తన టాలెంట్‌ను మెరుగుపరుచుకుంటోంది. తమ గ్రామంలోని సాంఘిక దురాచారాల కారణంగా బాలికా విద్యకు సరైన ప్రోత్సాహం లేదు. దీంతో దృష్టి స్థానిక బాలికలకు టీచింగ్ చేస్తూ బాలికా విద్య, సాధికారతకు పాటుపడుతోంది. ఇదిలా ఉంటే.. దృష్టి స్టడీ అవసరాలను అర్థం చేసుకుంటూ.. ఆమె వేగానికి అనుగుణంగా చదువు చెప్పే ట్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఆమె తండ్రి ఇంటింటికీ వెళ్లేవాడు. కానీ ప్రతిచోటా ఎగతాళికి గురయ్యేవాడు. అయితే ఇప్పుడు ట్యూటరింగ్ యాప్ సహాయంతో తను రోజుకు 4-5 గంటలు చదువుతోంది.
'తరగతి గదిలో దృష్టి ఎప్పుడూ ఇతర పిల్లల కంటే చురుగ్గా ఉంటుంది. టీచర్ బోధించేటపుడు ప్రతి విషయంపై అనేక ప్రశ్నలు అడిగేది. తను భవిష్యత్‌లో 'ఐఏఎస్ కావాలని, ప్రపంచాన్ని మార్చాలని కలలు కంటోంది. అంతేకాదు తనలాంటి ఆడపిల్లలకు చదువు చెప్పాలని భావిస్తోంది' అని ఆమె తండ్రి అశ్విని కుమార్ తెలియజేశారు.