మోడల్స్‌పై పదే పదే రేప్‌లు.. ధనవంతుల చేతిలో బలి..

by Manoj |
మోడల్స్‌పై పదే పదే రేప్‌లు.. ధనవంతుల చేతిలో బలి..
X

దిశ, సినిమా : స్కై ఒరిజినల్ డాక్యుమెంటరీ ప్రాజెక్ట్ 'స్కౌటింగ్ ఫర్ గర్ల్స్ : ఫ్యాషన్స్ డార్కెస్ట్ సీక్రెట్' టీజర్ ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎంతటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారో అప్పటి మోడల్స్ పూసగుచ్చినట్లు వివరించారు. 17 ఏళ్లకే మోడలింగ్‌లో సత్తా చాటేందుకు ఎంటర్ అయిన తమను పదే పదే బలవంతంగా రేప్ చేశారని చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఫొటోగ్రాఫర్స్ తమతో ఏ విధంగా బిహేవ్ చేసేవారు.. టాప్ టూ బాటమ్ డ్రెస్‌లు మొత్తం విప్పేసి నగ్నంగా ఉండమని ఎందుకు కోరేవారో ఇందులో వివరించారు. ఇక అమ్మాయి నచ్చితే మోడలింగ్‌లో రాణించేందుకు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్ వారికి ఏ విధంగా సాయం చేసేవారు.. రిలేషన్‌షిప్స్ వర్కౌట్ కాకపోతే ఎన్ని దారుణాలకు ఒడిగట్టేవారో చెప్పుకొచ్చారు. మోడలింగ్ ఏజెంట్స్‌తో లైంగిక వేధింపులకు గురికావడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed