ఎట్టకేలకు ఒక్కటైన బాలీవుడ్ జంట.. వెడ్డింగ్ ఫొటోస్ రిలీజ్

by Web Desk |
ఎట్టకేలకు ఒక్కటైన బాలీవుడ్ జంట.. వెడ్డింగ్ ఫొటోస్ రిలీజ్
X

దిశ, సినిమా : యాక్టర్ కమ్ ఫిల్మ్ మేకర్ ఫర్హాన్ అక్తర్, సింగర్ శిబానీ దండేకర్‌ జంట ఎట్టకేలకు ఒక్కటైంది. చాలాకాలంగా రిలేషన్‌షిప్‌ మెయింటైన్ చేస్తున్న వీరిద్దరూ శనివారం మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఈ విషయంపై ఈ రోజు వరకు పెదవి విప్పలేదు. అయితే తాజాగా తమ వెడ్డింగ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫర్హాన్.. ఒక నోట్ జత చేశాడు. 'కొన్ని రోజుల క్రితం నేను, శిబాని ఒక్కటయ్యాం. ఆ రోజున మా గోప్యత అవసరాన్ని గౌరవించిన వారందరికీ కృతజ్ఞతలు. ఏదేమైనప్పటికీ, కొన్ని విలువైన క్షణాలను మీతో పంచుకోకుండా, మీ ఆశీర్వాదాలు కోరకుండా మా ప్రయాణాన్ని ప్రారంభించడం అసంపూర్ణంగానే ఉంటుంది. మా నుంచి మీకు ప్రేమతో..' అంటూ ముగించాడు. ఇక శిబానీ సైతం 'మిస్టర్ & మిసెస్', 'హే దేర్ హస్బెండ్' క్యాప్షన్‌తో రెండు ఫొటోలు షేర్ చేసింది. ఈ మేరకు కోస్టార్స్, అభిమానుల నుంచి వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

https://www.instagram.com/p/CaTpIXJsCYx/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CaTqyvujcEm/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CaTpJBbDwBG/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story