Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌ను కలవర పెడుతున్న.. సర్కారు వారి పాట

by S Gopi |   ( Updated:2022-04-15 09:13:00.0  )
Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌ను కలవర పెడుతున్న.. సర్కారు వారి పాట
X

దిశ, వెబ్ డెస్క్: సినీ ప్రేక్షకులను అలరించడానికి స్టార్ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ఒకటి తర్వాత ఒకటి విడుదలవుతూ అభిమాలను అలరిస్తూ ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు RRR, KGF 2 చిత్రలు రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను కొళ్లగొడుతూన్నాయి. ఇవికాక ప్రజెంట్ విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు 'ఆచార్య'. ఈ మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తర్వాత రాబోయే చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ "సర్కారు వారి పాట". ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఈ చిత్రం విడుదలపై ప్రకటన చేశారు. కానీ ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా మే 12న విడుదల అని ప్రకటించిన మూవీ మేకర్స్ ఇప్పుడు, అదే రిలీజింగ్ డేట్ ను దాటవేస్తే... ఇదే విషయంపై అభిమానులలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ మూవీలో ఒక్క ముఖ్యమైన పాట చిత్రీకరణ, అలాగే మహేశ్ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కూడా మొదలు పెట్టలేదు. అందుకే విడుదల తేదీని మూవీ మేకర్స్ పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాలంటే ఇంకా కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story